గోదావరి, కృష్ణా నదులు, వాటి ఉపనదులతో సహా ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాల గుండా ప్రవహించే నదుల్లో మరో రెండు రోజుల పాటు నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది.
ఉత్తరాంధ్ర తీరంలో పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం (ఆగస్టు 31,2024) న బలపడటంతో ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
ఇది మరింత పశ్చిమ వాయవ్య దిశగా పయనించి శనివారం అర్ధరాత్రికి కళింగపట్నానికి సమీపంలోని విశాఖపట్నం- గోపాల్పూర్ మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని అమరావతి IMD డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఏపీ సీఎం చంద్రబాబు హై అలర్ట్.
గోదావరి, కృష్ణా నదులు, వాటి ఉపనదులతో సహా ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాల గుండా ప్రవహించే నదుల్లో మరో రెండు రోజుల పాటు నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. నాగావళి, వంశధార, సువర్ణముఖి, చంపావతి, గోస్తని, శారద, వరాహ, శబరి, తమ్మిలేరు, ఏలేరు నదుల్లో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం తెలిపింది. తెలంగాణ గుండా ప్రవహించే నదులకు కూడా (CWC )ఇలాంటి హెచ్చరికలు చేసింది.
పశ్చిమ, వాయువ్య బంగాళాఖాతంలో ఆగస్టు 31 వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని IDM తెలిపింది.
AP state government planning society website లో గత 24 గంటల డేటాను ఉదయం 9.30 గంటల వరకు అప్డేట్ చేయాల్సి ఉండగా, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం శనివారం